రైతుల నిరసనలు ఉద్ధృతం.. నోయిడా - ఢిల్లీ రహదారి మూసివేత!

  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • చర్చలు అసంపూర్ణం కావడంతో ఉద్ధృతమైన రైతు నిరసనలు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి వెళ్లాలన్న నోయిడా అధికారులు
న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రధాన నోయిడా - ఢిల్లీ రహదారిని అధికారులు మూసివేయగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో నిరసనలు తెలిపేందుకు యూపీ నుంచి వచ్చిన రైతులు గంటగంటకూ ముందుకు వస్తుండటంతో అధికారులు ఈ ముఖ్యమైన రహదారిని మూసివేశారు.

నిన్న కేంద్ర మంత్రులతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన సమావేశం విఫలం కావడం, ఎటువంటి నిర్ణయాలూ తీసుకోకుండా అసంపూర్ణంగా ముగియడంతో రైతులు ఈ ఉదయం తమ నిరసనల ఉద్ధృతిని మరింతగా పెంచారు.

దీంతో ఢిల్లీకి ప్రయాణించే నోయిడా వాసులు ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారులపై ప్రయాణించాలని కాళింది కుంజ్ రహదారిని ఎంచుకోవాలని, చిల్లా మార్గంలో రావద్దని నోయిడా ట్రాఫిక్ పోలీసులు కోరారు.

కాగా, ఢిల్లీ - నోయిడా రహదారిపై పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు టెంట్లు, వేసుకుని, అక్కడే వంటలు వండుకుని తింటూ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీకి తూర్పున ఉన్న పంజాబ్, హర్యానా మార్గాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది.

New Delhi
Noida
Farmers
Protests

More Telugu News